Posts

Showing posts from October, 2018

10/26/2018

Image
10/26/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , క-మ  హల్లులు గుర్తుపట్ట గలగటం య,ర, ల, వ హల్లులు వ్రాయటం  పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం రెండక్షరాల పదాలు చదవగలగటం (ఉదా : అర,అల, కల,వల మొదలగునవి) తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగటం ఇంటి పని 11/2 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని 1. ప నుంచి వ వరకు అక్షరాలు మూడు సార్లు వ్రాయాలి 2. వ్రాయటం కష్టం గా అనిపిస్తే ఈ క్రింద విధముగా ప్రయత్నించాలి   --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------  

10/19/2018

Image
10/19/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , క-న హల్లులు గుర్తుపట్ట గలగటం ప వరుస హల్లులు వ్రాయటం    పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా : పన్ను , పండు, ఫలం , ఫలితం మొదలగు పదాలు విని ప మరియు ఫ కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా : బంతి, బంగారం , భయము, భటుడు మొదలగు పదాలు విని బ కి మరియు భ కి గల తేడాను తెలుసుకోవటం విశేషణాలు, క్రియా పదాలు తెలుగు లో చిన్న చిన్న వాక్యాలు చెప్పగలగడం   ఇంటి పని 10/26 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని 1. అ నుంచి మ వరకు అక్షరాలు, అర్ధాలు, వారముల పేర్లు, అంకెలు పునశ్చరణ చేసుకొని రావాలి 2. క్విజ్ నిర్వహించబడును. గెలిచిన జట్టు ఒక వారం ఇంటి పని సహాయ్యనవసరం లేదు.  --------------------------- ----దేశ భాషలందు తెలుగలెస్స---------------------------------  

9/13/2018

9/13/2018 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , మొదటి పది హల్లులు గుర్తుపట్ట గలగటం ట వరుస హల్లులు వ్రాయటం పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం, వాడుకను తెలుసుకోవటం  ఉదా : టపా , కంఠం  మొదలగు పదాలు విని  ట  మరియు ఠ  కి గల తేడాను తెలుసుకోవటం  ఉదా : డబ్బు, ఢమరు మొదలగు పదాలు విని డ కి మరియు ఢ కి గల తేడాను తెలుసుకోవటం అ నుంచి అః అచ్చులు, 1-15 అంకెలు , శరీర భాగాల పేర్లు , రంగుల పేర్లు - పునశ్చరణ      మాట్లాడే విధానము -భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలాలలో క్రియా పదము లో వచ్చే మార్పు (తిను, తాగు, వచ్చు మొదలగునవి) ఎలుక-- పిల్లి నీతి కథ ( నీతి: రూపం కంటే గుణ గుణాలు మిన్న) ఇంటి పని 9/20 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. అ నుంచి అః వరకు అచ్చులు చూడకుండా వ్రాయగలగాలి. తరగతి లో ఇచ్చిన కాపీ పుస్తకాల లో అ నుంచి అః వరకు  ఉన్న పేజీలు అభ్యాసం గా పూర్తి చెయ్యాలి. 2. తరగతి లో ప్రతీ విద్యార్థి చేత అ నుంచి అః వరకు అచ్చులుచూడకుండా వ్రాయప...

Class-9/28/2018

  9/28/2018 - వివరాలు  ( శుక్రవారం కి మార్చబడినది)   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ నుంచి అః అచ్చులు , క నుంచి ణ వరకు హల్లులు వ్రాయటం అంకెలు 1-20  క్రియా  పదాలు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో మారే పద్ధతి  చిన్న చిన్న వాక్యాలు తెలుగు లో మాట్లాడటం   చీమ-మిడత నీతి కథ ( నీతి: భవిష్యత్తు కోసం ముందు గానే ఆలోచించుకొని కష్టపడి దాచుకోవాలి ) ఇంటి పని 10/5 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. క నుంచి ణ వరకు మూడు సార్లు వేరే కాగితం లో వ్రాసి తీసుకొని రావాలి . 2. తల్లి తండ్రులు పిల్లల్నిఅంకెలు అడగాలి.

Class-9/21/2018 (Quiz1)

Image
9/21/2018 - వివరాలు ఈ తరగతి లో విద్యార్థులు కి పరీక్ష నిర్వహించ బడినది. అ నుంచి అః వ్రాయగలగటం, వాటి శబ్దాలను ఆధారం గ చేసుకొని పరీక్షా పత్రం ఇవ్వబడినది .  త రువాత పరీక్ష లో ఆ నుంచి ఱ వరకు ఆధారం గా చేసుకొని నవంబర్ మొదటి వారం లో పరీక్ష ఉంటుంది.