Contents



అందరికి స్వాగతం. మీ పిల్లలు తెలుగు తరగతి లో నేర్చుకో  బోయేవి, ప్రతి వారం తరగతి లో నేర్చుకునే అంశాలు (వాటి వివరాలు) ఇక్కడ పొందు పరచబడును.

ఈ తరగతులు ముగిసే సరికి మీ పిల్లలు ఈ క్రింది విషయములు  నేర్చుకుంటారు:


విషయ సూచిక 
పట్టిక 1: అక్షరమాల
  1. తెలుగు అక్షరాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
  2. గుణింతాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
  3. వత్తులను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
  4. దిత్వాక్షరాలు , సంయుక్తాక్షరాలు
  5. పదాలు - చదవ గలగటం, వ్రాయగలగటం
  6. పదాలకి  అర్ధాలు తెలుసుకోవటం, వ్రాయటం
పట్టిక 2: వ్యాకరణం
  1. కర్త , కర్మ, క్రియ
  2. సామాన్య వాక్యాలు
  3. వర్తమాన , భూత , భవిష్యత్తు  కాలములలో వాక్యాలు చెప్పగలగటం 
  4. ఏకవచన, బహువచన వాక్యాలు /వాటి వాడుక
  5. స్త్రీ లింగము , పురుష లింగముల వాక్యాలు/ వాటి వాడుక
  6. భాషా భాగాలు
పట్టిక 3: సంభాషణ
  1. మాట్లాడ గలగటం
  2. ప్రశ్నలు అడగటం
  3. ప్రశ్నలకు  సమాధానం చెప్పటం
  4. వాక్యాలు అనువదించటం
  5. వేమన శతకాలు (5)
  6. సుమతి శతకాలు (5)
పట్టిక 4: విషయ అవగాహన
  1. అంకెలు (1-100)
  2. రంగులు
  3. వారములు 
  4. కాలాలు
  5. శరీర భాగాలు
  6. కూరగాయలు, పండ్లు  పేర్లు
  7. బంధుత్వాలు (కుటుంబం)
  8. తెలుగు వంటకముల పేర్లు
  9. తెలుగు పండుగల పేర్లు ,వాటి ప్రాముఖ్యత
ప్రతి తరగతి చివరి లో ఒక పంచతంత్ర కథ /రామాయణం నుంచి ఒక కథ చెప్పబడును.

ప్రతి వారం ఇంటిపని గా ఒక అభ్యాసం ఇవ్వ బడును . పిల్లలు తరగతి లో తెలుగు మాట్లాడుతారు ఇంటిలో తల్లితండ్రులు పిల్లలను తెలుగు లో మాట్లాడమని ప్రోత్సహిస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు.

దేశ భాషలందు తెలుగు లెస్స



Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019