Class-8/2/2018


 8/2/2018 - వివరాలు

 ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు


  • అ ,ఆ ,ఇ ,ఈ ,ఉ  అచ్చులు వ్రాయటం
  • పదాలు విని నేర్చుకున్న అక్షరాలను గుర్తుపట్టడం,వాడుకను తెలుసుకోవటం 
ఉదా :అమ్మ,అక్క, ఆవు, ఆవిడ మొదలగు పదాలు విని అ మరియు ఆ కి గల తేడాను తెలుసుకోవటం 
ఉదా :ఇల్లు, ఇటుక, ఈగ,ఈరోజు మొదలగు పదాలు విని ఇ మరియు ఈ కి గల తేడాను తెలుసుకోవటం 
  • అ నుంచి అః చెప్పగలగటం
  • కొన్ని పదాలకు  అర్ధాలు
  • దృశ్యం 1: పదాలకు అర్ధాలు

  •  అంకెలు (1-10) గుర్తుపట్టడం
  •  మొదటి నాలుగు వారముల  పేర్లు (ఆది, సోమ, మంగళ, బుధ)
  • అమ్మ తరుపు  బంధుత్వాలను గుర్తుపట్టడం
  • కొంగ- నక్క నీతి కథ ( నీతి: స్నేహితులను అవమానించరాదు )

ఇంటి పని 

8/9 తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. మొదటి ఐదు అచ్చులు ఐదు సార్లు పుస్తకం లో చూసి వ్రాయాలి .

    రాయటం కష్టంగా ఉంటే ఈ క్రింద బొమ్మ లో చూపించిన విధముగా ప్రయత్నించాలి
దృశ్యం 2: అక్షరాలు వ్రాయటం


2. అమ్మ తరుపు - అమ్మమ్మ , తాతయ్య , దొడ్డమ్మ / పెద్దమ్మ ,పిన్ని , మావయ్య పేర్లు తెలుసుకుని రావాలి.
3. ఒకటి నుంచి పది వరకు అంకెలు తల్లి తండ్రులు పిల్లల్ని ఇంట్లో చెప్పమని అడగాలి 

--------------------------------------దేశ భాషలందు తెలుగు లెస్స----------------------------------






Comments

Popular posts from this blog

6/9/2019

6/16/2019

6/2/2019